Wednesday, October 30, 2013

Chiranjeevulu Songs Lyrics

Chiranjeevulu, Gantasala, 1956, Malladi Krishna Shastri, Old Songs, Old Songs Lyrics

చిత్రం : చిరంజీవులు (1956)
 రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
 సంగీతం, గానం : ఘంటసాల
పల్లవి :
 మిగిలింది నేనా బ్రతుకిందుకేనా...
   ఇందుకేనా
 మిగిలింది నేనా బ్రతుకిందుకేనా         (2)
 మరచేవా ఎడబాసి మాయమయేవా (2)
 ॥
 చరణం : 1
 కన్నార చూసింది కలకలా నవ్వింది     (2)
 మనసార దరిజేరి మురిసిపోయింది
 మనసైన పాట...
 మనసైన పాట మన పూలబాట
 మరచేవా ఎడబాసి మాయమయేవా
 ॥
 చరణం : 2
 నీవు నేను కలసి కలగన్న మన ఇల్లు     (2)
 ఈ తీరై కన్నీరై కూలిపోయెనా
 ఆకాశమేలే అలనాటి మన ఊహ         (2)
 ఈ తీరై కన్నీరై రాలిపోయెనా
 ॥
 చరణం : 3
 కనుల వెలుగు లేదు నీ పలుకు వినరాదు
 మనసు నిలువలేదు నిన్ను మరువలేదు
 భారమై విషమై రగిలే ఈ బ్రతుకెందుకో...
 పల్లవి :
 మనసు నీదే మమత నాదే
   నా దానవే నే నీవాడనే     (2)
 చరణం : 1
 చివురు మామిడి పందిళ్లనీడా
   నిలిచింది చిలక నా కోసమే     (2)
 చివురింటి చిన్నదానా
   నా దానవే నే నీవాడనే
 ॥
 చరణం : 2
 కనుల కాటుక కళ్యాణ తిలకం
   నగుమోము కలకల నా కోసమే     (2)
 చిరునవ్వు చిన్నదాన
   నా దానవే నే నీవాడనే
 ॥
 చరణం : 3
 పువ్వులు జల్లి పన్నీరు జల్లి దీవించి మీ వారు పంపేరులే పువ్వులు జల్ల్లి పన్నీరు జల్లి దీవించి మీ వారు పంపేరులే
 మనసైన చిన్నదానా మీ ఇంటికి మా ఇంటికీ
 ॥

Tuesday, October 29, 2013

Garshana Songs Lyrics

Garshana, 1988, Ilayaraja, Rajasri, SP Balu, 

చిత్రం : ఘర్షణ (1988)
రచన : రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా
నిర్వహణ: నాగేష్
గానం : ఎస్.పి.బాలు, బృందం

పల్లవి :
 రోజాలో లేతవన్నెలే రాజాకే తేనె విందులే
 ఊసులాడు నా కళ్లు నీకు నేడు సంకెళ్లు
 పాలపొంగు చెక్కిళ్లు వేసెపూల పందిళ్లు
 లవ్ లవ్ ఈ కథా ఓహో మన్మథా
 మైకం సాగనీ దాహం తీరనీ
 ॥
చరణం : 1
 మొన్న చిగురేసెనే నిన్న మొగ్గాయెనే
 నేడు పువ్వాయెనే తోడుకల్లాడెనే
 సందేళ వయసెందుకో చిందులేస్తున్నదీ
 అందాల సొగసేమిటో అందుకోమన్నదీ
 క్షణం క్షణం ఇలాగే వరాలు కోరుతున్నది చిన్నది
 ॥
చరణం : 2
 ముద్దు మురిపాలలో సద్దులే చేసుకో
 వేడి పరువాలలో పండగే చేసుకో
 నా చూపులో ఉన్నవీ కొత్త కవ్వింతలూ
 నా నవ్వులో ఉన్నవీ కోటి కేరింతలూ
 ఇవే ఇవే ఈవేళ సుఖాల పూల వేడుక వేడుక
 ॥
 గానం : వాణీజయరాం, బృందం
 పల్లవి :
 రాజా రాజాధి రాజాధి రాజా
 పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
 ॥
 నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా (2)
 కోట లేదు పేటా లేదు అప్పుడు నే రాజా
 ॥
 చరణం : 1
 ఎదురూ లేదు బెదురూ లేదు... లేదు నాకు పోటి
 లోకం లోనా లోకుల్లోనా నేనే నాకు సాటి
 ॥
 ఆడి పాడేనులే అంతు చూసెనులే
 చెయ్యి కలిపేనులే చిందులేసేనులే
 చీకు చింతా లేదు ఇరుగూ పొరుగూ లేదు
 ఉన్నది ఒకటే ఉల్లాసమే
 ॥చింతా॥
 నింగీ నేల నీరు నిప్పు గాలి దూళి నాకే  తోడు
 ॥
చరణం : 2
 రైకా కోకా రెండూ లేవు ఐనా అందం ఉంది
 మనసు మంచి రెండూ లేదు ఐనా పరువం ఉంది
 ॥కోకా॥
 కలలూరించెనే కథలూరించెనే
 కళ్లు వలవేసెనే ఒళ్లు మరిచేనులే
 వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి
 రచ్చకు ఎక్కే రాచిలకలే
 ॥॥॥